Two Dead In Mall: సరదాగా షాపింగ్‌ చేద్దామని షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన వినియోగదారులు ప్రమాదం బారిన పడ్డారు. మాల్‌పైన ఉన్న సీలింగ్‌ గోడ అకస్మాత్తుగా కిందకు పడింది. భారీ సీలింగ్‌ పడడంతో పెద్ద ఎత్తున ప్రజలు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంతో షాపింగ్‌మాల్‌లోని వినియోగదారులు భయాందోళన చెందారు. వెంటనే బయటకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో తెలియక ఆరు బయటకు వచ్చి నిలబడ్డారు. ఈ సంఘటన యూపీలోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Train Accident: రైలులో డ్రైవింగ్‌ వదిలేసి మొబైల్‌ ఫోన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌.. ఇదే 14 మంది మృతికి కారణం


గ్రేటర్‌ నోయిడాలో బ్లూ షఫైర్‌ మాల్‌ ఉంది. ఈ మాల్‌లో ఆదివారం మధ్యాహ్నం అకస్మాత్తుగా సీలింగ్‌ గోడ కుప్పకూలింది. పెద్ద పెచ్చు హఠాత్తుగా పడింది. అయితే ఆ సమయంలో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ సీలింగ్‌ షాపింగ్‌ కోసం వచ్చిన ప్రజలపై కూడా పడింది. ఘజియాబాద్‌కు చెందిన హరేంద్ర పాటిల్‌ (35), షకీల్‌ (35) అనే వ్యక్తులు తీవ్ర గాయాలతో మాల్‌లోనే మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన మాల్‌ సిబ్బంది, ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.


Also Read: Brutal Murder: షూట్‌కు పిలిచి ఫొటోగ్రాఫర్‌ను దారుణ హత్య..రూ.15 లక్షల విలువైన కెమెరాలతో పరార్‌


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. 'మాల్‌లోని ఐదో అంతస్తు నుంచి సీలింగ్‌ ఊడిపడింది. ఘటనలో ఇద్దరు మరణించారు. ఎస్కలేటర్‌ సమీపంలో ఈ ఘటన జరిగింది' అని డీసీపీ హృదేశ్‌ కఠారియా తెలిపారు. ఆదివారం కావడంతో భారీగా ప్రజలు షాపింగ్‌, వినోదం కోసం వచ్చారు. అయితే అదృష్టవశాత్తు పెద్ద ఎత్తున ప్రమాదం జరగలేదు. కాగా, ఊడిన సీలింగ్‌లో భారీగా ఇనుప రాడ్‌లు ఉన్నాయి. పెద్ద పెద్దవి ఉండడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది. ఎస్కలేటర్‌కు సహాయంగా ఈ సీలింగ్‌ ఏర్పాటుచేసినట్లు మాల్‌ నిర్వాహకులు తెలిపారు. 


ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాల్‌ నిర్వాహకులకు నోటీసులు అందించారు. తదుపరి విచారణ వెంటనే చేస్తామని పోలీసులు హామీలు ఇచ్చారు. మృతుల కుటుంబసభ్యులు మాత్రం తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో భయానకంగా ఉంది. సీలింగ్‌ పడిన అనంతరం మాల్‌లో ఉన్న పరిస్థితులు దృశ్యాల్లో ఉన్నాయి. మృతదేహాలను తీసుకెళ్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయి. మాల్‌లో కూడా ప్రజల ప్రాణాలకు భద్రత లేదా? పలువురు ప్రశ్నిస్తున్నారు. మృతుల కుటుంబానికి మాల్‌ నిర్వాహకులు న్యాయం చేయాలని నెటిజన్లు డిమాండ్‌ చేస్తున్నారు.




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి